25 May, 2026 | 6:57 AM

బ్యాచ్‌లర్స్ కష్టసుఖాలను హైలైట్ చేస్తున్న 'మజాకా' పాట

29-01-2025 11:20 PM

సందీప్ కిషన్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతున్న చిత్రం ‘మజాకా’. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, ఉమేష్ కేఆర్ బన్సల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో రీతూవర్మ హీరోయిన్‌గా నటించింది.

‘మన్మధుడు’ ఫేం అన్షు ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. రావు రమేష్ భార్యగా నటించింది. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి మొదటి పాట బ్యాచ్‌లర్ యాంథమ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

బ్యాచ్‌లర్స్ జీవితంలో ఉండే స్ట్రగుల్స్, జాయ్స్‌ను హైలైట్ చేసేలా ఉంది. పాపులర్ రైటర్ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట కుర్రాళ్లకు ఎవర్‌గ్రీన్ ఫేవరెట్ కానుంది. ఈ పాటను ధనుంజయ్ సీపాన ఎంతో హుషారుగా ఆలపించారు. లియోన్ జేమ్స్ సంగీతం, రఘు మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ పాట సినిమాలో హైలైట్‌గా నిలవనుంది.