15 August, 2026 | 12:56 AM

దోమల దండయాత్ర.. కాలనీవాసుల అవస్థలు!

15-08-2026 12:00 AM

ఫాగింగ్ కోసం ఎదురుచూపులు

పట్టించుకోని అధికారులు

ఆదిబట్ల, ఆగస్టు 14 (విజయక్రాంతి): ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని నీలం సంజీవరెడ్డి నగర్ కాలనీ, రాగన్నగూడ, సాయి టౌన్షిప్ కాలనీ, హ్యాపీ హోమ్స్, పటేల్ గూడ, బొం గులూరు, తుర్కయంజాల్, టిసిఎస్, ఆదిభట్ల గ్రామం, కొంగరకలాన్ ఇంజాపూర్, కమ్మగూడ, పాటిగూడ,పాటు పలు కాలనీల్లో దోమల బెడద తీవ్రంగా మారింది. వర్షాల కారణంగా ఖాళీ స్థలాలు, మురుగు కాలువలు, నీరు నిలిచే ప్రాంతాల్లో దోమలు విపరీతం గా పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వేళ బయటకు వచ్చి కొద్దిసేపు వాకింగ్ చేద్దామన్నా దోమల కాటును తట్టుకోలేక ఇళ్లకు తిరిగి వె ళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు.

దోమల బెడద కేవలం బయటే కాకుండా ఇళ్లలోనూ తీవ్రంగా ఉందని కాలనీ వాసు లు వాపోతున్నారు. రాత్రివేళల్లో దోమలు ఎ క్కువగా ఉండటంతో నిద్రకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. చిన్నారులు, వృద్ధులు దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. దోమల మూ లంగా  ప్రజలు సీజన్ వ్యాధులకు గురవుతున్నారు.కాలనీల్లో పారిశుద్ధ్య చర్యలు మరింత ముమ్మరం చేయాలని కోరుతున్నారు.

ఖాళీ స్థలాల్లో నిల్వ నీటితో సమస్య

పలు కాలనీల్లో ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం, వర్షపు నీరు నిలిచిపోవడం దోమల పెరుగుదలకు కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు. కేవలం ఫాగింగ్ చేయడంతో పాటు నిల్వ నీటిని తొలగించడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం, దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఫాగింగ్ కోసం ఎదురుచూపులు

దోమల తీవ్రత పెరుగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి కాలనీకి ఫాగింగ్ షెడ్యూల్ రూపొందించి సిబ్బందిని పంపాలని, దోమల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఫాగింగ్ చేపడుతున్నాం.. 

దోమల నివారణకు ఆదిబట్ల సర్కిల్ పరిధిలో ఫాగింగ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం.. కొద్దిరోజులుగా ఫాగింగ్ కా ర్యక్రమం నిరంతరంగా కొనసాగుతోంది. దోమల బెడద ఉన్న ఖాళీ స్థలాలు, కాలనీల్లో సిబ్బందితో ఫాగింగ్ చేపడుతున్నాం. దోమల నివారణకు మా వం తు చర్యలు తీసుకుంటున్నాం.అవసరమై న ప్రాంతాలను గుర్తించి మరింత సమర్థవంతంగా చర్యలు చేపడతాం.. 

 ఏఎంహెచ్‌ఓ శారద