15 August, 2026 | 1:49 AM

అక్రమ నిర్మాణాల జోరు

15-08-2026 12:00 AM

రోజురోజుకూ పెరుగుతున్న అనుమతి లేని భవనాలు

కానరాని అధికారుల నిఘా

జవహర్‌నగర్‌లో రెచ్చిపోతున్న అక్రమార్కులు

జవహర్‌నగర్, ఆగస్టు 14 (విజయక్రాంతి): మేడ్చల్ మ ల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ పరిధి లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మున్సిపల్ నిబంధనలను పట్టించుకోకుండా కొందరు నిర్మాణదారు లు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. కొన్ని ప్రాంతాల్లో భవన నిర్మాణాల కు అవసరమైన అనుమతులు తీసుకోకుండానే పనులు చేపడుతున్నారని, మరికొన్ని చోట్ల అనుమతులకు మించి అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. రోడ్డు మార్జిన్లు, డ్రైనేజీ స్థలాలు, ప్ర భుత్వ స్థలాలకు సమీపంలోనూ నిర్మాణాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఫిర్యాదులు చేసినా స్పందన కరువు

అక్రమ నిర్మాణాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ వెంటనే చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యే వరకు అధికారులు పట్టించుకోకపోవడం, ఆ తర్వాత నోటీసులతో సరిపెట్టుకోవడం వల్ల అక్రమ నిర్మాణదారులకు మరింత ధైర్యం వస్తోందని స్థానికులు అంటున్నారు.

నిబంధనలు ఎవరి కోసం?

సాధారణ ప్రజలను ఇంటి నిర్మాణానికి అనుమతులు, పన్నులు, ఇతర నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్న అధికారులు.. కొందరు నిర్మాణదారుల వైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అక్రమ నిర్మాణాలపై రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల నిర్లక్ష్యం ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తమకు లేని వెసులుబాటు ఆ నిర్మాణదారులకు ఎలా ఇస్తున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

సమగ్ర సర్వేకు డిమాండ్

జవహర్‌నగర్ పరిధిలోని అన్ని అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక సర్వే నిర్వహించి, అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వ స్థలాలు మరియు ప్రజా రహదారులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి కైనా సంబంధిత అధికారులు స్పందించి అ క్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతా రా? లేక నిర్మాణాలు పూర్తయ్యే వరకు మౌనం వహిస్తారా? అనేది వేచి చూడాలి.