అటకెక్కిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ
- అధికారంలోకి రాగానే తెరిపిస్తామన్న ప్రభుత్వం
- షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణపై ప్రభుత్వం వెనుకడుగు
- ఫ్యాక్టరీల పునరుద్ధరణపై దృష్టి పెట్టని వైనం
బోధన్, ఆగస్టు 14 (విజయ క్రాంతి) : బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీను పునరుద్ధరిస్తాం.. ముందుగా బోధన్ పట్టణంలోని నిజాంచక్కెర కార్మాగారాన్ని తెరుస్తామని పదేపదే చెప్పిన ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు కార్యరూపం దాల్చడం లేదు. చంద్రబాబు పాలనలో నిజాం షుగర్స్ జాయింట్ వెంచర్ పేరిట ప్రైవేట్ కంపెనీ పరమైంది. ప్రైవేట్ యాజమాన్యం చక్కెర ఫ్యాక్టరీని అడ్డం పెట్టుకుని రూ.కోట్ల సంపదను దోచుకుని, చివరికి ఫ్యాక్టని నడపలేమంటూ చేతులెత్తేసింది.
ఎన్డీఎస్‌ఎల్ కు బోధన్ లోని శక్కరనగర్, మెట్పల్లి, మెదక్ యూనిట్లకు 2015 డిసెంబర్లో లేఆఫ్ ప్రకటించింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. చెరుకు కొనే దిక్కులేకపోవటంతో రైతులు వేరే పంటల వైపు మళ్లారు. అయితే, ఫ్యాక్టరీ దీని తెరిపించాలని కార్మికులు, కర్షకులు అప్పటి నుంచే డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమం లోనే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చింది.
నిజాం షుగర్స్ యూనిట్ల పునరుద్ధరణపై అధ్యయనానికి 2024 జనవరిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఈ కమిటీ లోతుగా అధ్యయనం చేయలేదు. ఫ్యాక్టరీ నడవాలంటే ముడి సరుకు ’చెరుకు’ కావాలి. చెరుకు సాగుపై రైతు లను చైతన్యవంతుల్ని చేయడానికి వ్యవసాయశాఖ ఎటువంటి కార్యాచరణ చేపట్ట లేదు. రెండేళ్ల క్రితం చెరుకు సాగుపై సదస్సును ఏర్పాటుచేసినా, ప్రోత్సాహకా లపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు, ఫ్యాక్టరీ తెరిపిస్తే చెరుకు వేయ దానికి సిద్ధమని, అయితే, చెరుకు వేసిన తర్వాత ఫ్యాక్టరీ పునరుద్ధ రణ జరగకపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అంతా అయిపోయాక హడావుడి. ఫ్యాక్టరీలను తెరిపించకుండా మొండికేసిన ప్రభుత్వం.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన తరుణంలో హడావుడి చేస్తున్నది. వరి వద్దు. ఆరుతడి పంటలు వేయండని ప్రచారం చేస్తున్నది. దీంతో ఏం చేయాలో, ఏం పండించాలో తెలియక జిల్లా రైతులు అయో మయానికి గురవుతున్నారు.
కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా ఈపాటికే షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించి ఉంటే రైతులకు ఈ గందరగోళం ఉండేది కాదు నిజాం షుగ ర్స్ తెరిపిస్తామని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, ఆ తర్వాత కూడా అనేకసార్లు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదట్లో కమిటీలు, అధ్యయనాలు అంటూ హడావుడి చేసిన సర్కారు... ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు.
మరోపక్క నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలంటూ నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవ ర్గాల్లోని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రూ. వంద కోట్లు ఇవ్వండి.. ఫ్యాక్టరీని బెల్లం ఉత్పత్తి కేంద్రంగానైనా మార్చుకుంటామని కోరుతున్నా, ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి చెరుకు రైతులు సిద్ధ పడుతున్నారు.
ఫ్యాక్టరీల పునరుద్ధరణపై దృష్టి పెట్టని వైనం
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రేవంత్ ప్రభుత్వం ఎనలేని హడావుడి చేస్తున్నది. వరి కాకుండా ప్రత్యామ్నయ పంటల వైపు మళ్లాలని రైతులకు సూచిస్తు న్నది. ఆరుతడి పంటలు వేయాలని ప్రచారం చేస్తున్నది. అయితే, అతి తక్కువగా నీటితో పండే చెరుకు అంశాన్ని మాత్రం కావాలనే విస్మరిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం.. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరెపిస్తే, ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రైతులకెంతో మేలు జరిగేది. తక్కువ నీటితో సాగయ్యే చెరుగు వైపు వెళ్లేందుకు అన్నదాతలు మొగ్గు చూపే వారు, కానీ, అధికారంలోకి వచ్చి మూడేండ్లు సమీపిస్తున్నా, కాంగ్రెస్ సర్కారు షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు.
తక్కువ నీటితో పండే పంట ’చెరుకు’
చెరుకు పంట కాలం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆరు తడి పంటల మాదిరిగానే తక్కువ నీటితో పండు తుంది. వరి పంటతో పోల్చితే చాలా తక్కువ నీటితో ఈ పంటను సాగుచేయవచ్చు. 9 నెలల నుంచి ఏడాది కాలవ్యవధి కలిగిన చెరుకు పంటకు 15 రోజులకు ఒకసారి తడి ఇస్తే సరిపోతుంది. చీడ పీడలకు తట్టకునే శక్తి ఈ పంటకు ఉంది. వర్షాలు, తడి నెల రోజులు లేకపోయినప్పటికీ.. చెరుకు బరువు కొద్దిగా తగ్గవచ్చునేమోగాని... రైతుకు పెద్దగా నష్టం రాదు.
ప్రకృతి వైపరీత్యా లను.. ఎండలకు, వరదలకు తట్టుకుని పెరుగు తుంది హార్వేస్టింగ్, కూలీల సమస్యలు తప్పితే రైతులకు లాభాలు తెచ్చే పంటగా ’చెరుకు’కు పేరుంది. ఎల్న్ని లాంటి దుర్భిక్ష పరిస్థితుల్లో సైతం ఈ పంటను సాగుచేయవచ్చు. సారంగాపూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం రైతులు పోరుబాట పడుతున్నారు. ఎస్సీఎస్ ఎఫ్. చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా చెరుకు రైతుల సమావేశాలు జురు గుతున్నాయి.
’మేము చెరుకు పెట్టడానికి సిద్ధం.. ఫ్యాక్టరీని నడపండి’ అని వారు డిమాండ్ చేస్తు న్నారు. 16 ఏళ్ల కిందట ఎస్స్సీఎఫ్ను మూసివే శారు. ఫ్యాక్టరీ నష్టాలు, అప్పులను సాకుగా చూపించి రైతుల షేర్లకు ’జీరో వ్యాల్యూ’ ఆపాదించారు. ఎన్నికలకు ముందు అన్ని చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామన్న కాంగ్రెస్ హామీ మేరకు ఫ్యాక్ట దీని తెరవాలని రైతులు కోరుతున్నారు.
ఈ ఫ్యాక్టరీని తెరవటంలో ఇబ్బందులు ఉంటే... బెల్లం యూనిట్ మార్చి తెరి చినట్లయితే ఎంతో లాభం జరుగు తుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీని తెరిచి ఉంటే.. ఎల్ నినో పరిస్థితుల్లో ఆరు తడి పంటలు పండించాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు చెరుకును పంటను రైతులు పుష్కలంగా పండించేవారు
ఫ్యాక్టరీ తెరవండి.. చెరుకు సాగు చేస్తాం
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం బోధన్ ప్రాంత చెరుకు రైతులు ఎదురుచూస్తున్నారు. ఫ్యాక్టరీ నడుస్తుందనే భరోసా ఇస్తే చెరుకు సాగుకు సిద్ధంగా ఉన్నామని రైతులు చెబుతున్నారు. గతంలో ఫ్యాక్టరీ మూతపడటంతో చెరుకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ముందుగా ఫ్యాక్టరీ పునరుద్ధరణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని, రైతులకు సాగు ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరుతున్నారు.






