4 June, 2026 | 4:43 PM

చారకొండలో భారీ రోడ్డు ప్రమాదం

04-06-2026 03:23 PM

మహిళకు గాయాలు.

చారకొండ: కల్వకుర్తి వైపు నుంచి దేవరకొండ వైపుకు చక్కెర లోడుతో అతివేగంగా వెళ్తున్న లారీ, చారకొండ మండల కేంద్రంలోని కోదాడ–జడ్చర్ల ప్రధాన రహదారిపై(Kodad–Jadcherla Main Road) జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఘోర ప్రమాదానికి కారణమైంది. ముందుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటో ట్రక్కును ఢీకొట్టింది. అనంతరం ముందుగా వెళ్తున్న కారును కూడా బలంగా ఢీకొట్టి, చివరికి ఆ కారుపై బోల్తా పడింది.

ఈ ఘటనలో ఆటో ట్రక్కులో ఉన్న గోకారం గ్రామానికి చెందిన జమ్మల బోజ్జమ్మకు చేతి విరిగినట్లు సమాచారం. కారు డ్రైవర్, లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోడ్డు పక్కన ఉన్న దుకాణాదారులు మాత్రం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.