17 June, 2026 | 8:42 PM

Breaking News

ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •  

అంజన్న ఆశీర్వాద యాత్రను విజయవంతం చేయండి

11-03-2026 05:34 PM

మానకొండూర్,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని మహాశక్తి దేవాలయం నుండి కొండగట్టు వరకు నిర్వహించనున్న పాదయాత్రలో మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గన్నేరువరం మండల ప్రజలను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర రెడ్డి కోరారు. బుధవారం గన్నేరువరం మండల కేంద్రంలో బిజెపి  మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్  ఆధ్వర్యంలో మండల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథి హాజరైన ఆయన మాట్లాడుతూ పదివేల మంది కార్యకర్తలతో అంజన్న ఆశీర్వాద పాదయాత్ర చేయబోతున్నామని తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ పాల్గొంటారని తెలిపారు.