11 March, 2026 | 7:07 PM

పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేసిన ఎమ్మెల్యే

11-03-2026 05:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలంలోని వెంగవాపేట్ గ్రామంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలుకుంటూ వ్యాధి నివారణ టీకాలను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. పశువుల్లో వ్యాధి నివారణ పశువృద్ది పెంపొందించేందుకు ఈ టీకాలు దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారితోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.