12 May, 2026 | 11:41 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

నరేంద్ర మోదీ 'జనాగ్రహ సభ'ను విజయవంతం చేయండి

03-05-2026 10:00 AM

డబల్ ఇంజన్ సర్కారు వస్తేనే తెలంగాణ అభివృద్ధి

అబద్ధపు హామీలతో ప్రజలు నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

నరేంద్రమోదీ  తెలంగాణ అభివృద్ధికి నిబద్ధతతో కృషి: ఎంపీ డీకే అరుణమ్మ

గద్వాల: ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బీజేపీ 'జనాగ్రహ సభ'ను జయప్రదం చేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణమ్మ అన్నారు. శనివారం గద్వాలలో పట్టణంలోని డికె. బంగ్లా లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ డికె. అరుణమ్మ  మాట్లాడుతూ మూడవ సారి ప్రధాని బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సారి తెలంగాణకి వస్తున్నారని ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని  విమర్శించారు. అధికారం కోసం అబద్ధపు హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఎంపీ మండిపడ్డారు. కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టేందుకే 'జనాగ్రహ సభ' నిర్వహిస్తున్నామని, ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ జెండా ఎగురవేస్తుంది.

దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలోనూ పార్టీ బలపడుతోందని, అస్సాం, పుదుచ్చేరిలో సానుకూల వాతావరణం ఉందన్నారు.గ్రామాలలో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వా నిధులతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మేంబర్ బండల వెంకట రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే, అసెంబ్లీ పోటీ చేసిన అభ్యర్థులు బలిగేరా  శివా రెడ్డి, రాజగోపాల్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు దాస్ తదితరులు హాజరయ్యారు..