ఫీజుల చెల్లింపుపై వివరణ ఇవ్వండి
- నేడు స్పష్టమైన నివేదిక సమర్పించాలి
- ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ప్రైవేట్ విద్యాసంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులపై స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించారు. గురువారం లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. జీవో నెం.7లోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది.
బకాయిల చెల్లింపుల టైమ్‌లైన్‌ఫై స్పష్టమైన వివరణ ఇవ్వాలని గతంలో ఆదేశించినా ప్రభుత్వం స్పందించకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై గురువారం కల్లా స్పష్టమైన నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల నుంచి ఫీజులు డిమాండ్ చేయకూడదనే జీవోలోని నిబంధనపై విధించిన మధ్యంతర స్టేను కోర్టు గురువారం వరకు పొడిగించింది.






