3 August, 2026 | 1:50 AM

జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయండి

03-08-2026 01:11 AM

* ఆగస్టు 7న, బెంగుళూరులో జాతీయ ఓబీసీ 11వ, మహాసభ

* బీసీలకు చట్ట సభలో 50% రిజర్వేషన్ కల్పించాలి

* వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు

హనుమకొండ, ఆగస్టు 2 (విజయక్రాంతి): ఆగస్టు 7న బెంగళూరులో జరిగే 11వ, జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్ ను బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ హన్మకొండ నక్కలగుట్ట హరిత హోటల్ నందు ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్బంగా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ ఆగస్టు 7న, అఖిల భారత జాతీయ ఓబీసీ ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగే  11వ ఓబీసీ మహాసభ కు వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో బీసీ కులాలకు చెందిన విద్యార్థులు యువకులు, మహిళలు, బీసీ ఉద్యోగస్తులు, బీసీ ముఖ్య ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. జనాభాలో ఉన్న దాదాపు 60 శాతం బీసీలు అనేక సం.ల నుండి పోరాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ డిమాండ్ లను నెరవేర్చడం లేదని అన్నారు.

చట్టసభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగనణలో బీసీ కులగణన చేపట్టాలి, కేంద్రం లో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం నిధులు, మహిళా బిల్లు లో బీసీ మహిళలకు సబ్ కోటా, బీసీ ఉద్యోగస్థులకు ప్రమోషన్లలో రిజర్వేషన్, బీసీ క్రిమిలేయర్ రద్దు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయడం తదితర డిమాండ్ల  సాధన కోసం ఆగస్టు 7న, బెంగుళూరు డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ వేదికగా, కేంద్ర ప్రభుత్వలను నిలదీయడం జరుగుతుందని అన్నారు.

ఈ జాతీయ ఓబీసీ మహాసభకు దేశంలోని 36 రాష్ట్రల నుండి  దాదాపు 20వేల మంది బీసీ లు హాజరు కానున్నారని, వడ్లకొండ వేణు గోపాల్ గౌడ్ తెలిపారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ  కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు దాడి మల్లయ్య యాదవ్, బచ్చు ఆనందం, దొడ్డపల్లి రఘుపతి, తమ్మేల శోభరాణి, మాధం పద్మజ దేవి, సుశిళ, తెల్ల సుగుణ, కిషోర్, అంబాల రవి పటేల్, అరేగంటి నాగరాజు, వేముల మహేందర్ గౌడ్, తంగళ్లపెల్లి రమేష్, దాడి రమేష్ యాదవ్, కోలా ప్రతాప్ గౌడ్, అమరావది సారంగపాణి, శనిగరపు సుమన్, చాగంటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.