3 August, 2026 | 3:36 AM

9న బోనాల నిర్వహణకు తీర్మానం

03-08-2026 01:50 AM

ఘట్‌కేసర్, ఆగస్టు 2 (విజయక్రాంతి):  ఘట్‌కేసర్ డివిజన్ పరిధిలోని శివారెడ్డిగూ డ, మారుతీనగర్, శ్రీనిధి నెస్ట్ కాలనీలలో ఈనెల 9న బోనాల మహోత్సవాలను ఘ నంగా నిర్వహించాలని కాలనీల పెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈమేరకు ఆదివా రం నిర్వహించిన సమావేశంలో బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించి తీర్మానం చేశారు. మూడు కాలనీల ప్రజలం తా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకోవాలని నిర్ణయించారు. ఉత్సవాల నిర్వహణకు ప్రతి కుటుంబం సహకరించి, సామూహికంగా పాల్గొని బోనాల వేడుకలను విజయవంతం చేయాలని కాలనీల పెద్దలు కోరారు. ఈసమావేశంలో కంది ప్రవీణ్ కుమార్, మడిపడిగె ఆంజనేయులు, మడిపడిగె రాజ్కుమార్, లంబ శ్రీనివాస్ యాదవ్, మేడబోయిన సంజీవ ముదిరాజ్, వై. నితిన్ రెడ్డి, జి. సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.