11 April, 2026 | 3:50 PM

Breaking News

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •  

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

05-02-2026 05:54 PM

ఐ ఎఫ్ టీ యూ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివబాబు

జవహర్ నగర్, ఫిబ్రవరి 5,(విజయక్రాంతి):  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను నిరసిస్తూ చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని ఐఎఫ్ టీయూ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ కార్యాలయంలో శివబాబు ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె వాల్ పోస్టర్ ను మున్సిపల్ కార్మికులతో కలిసి గురువారం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా శివబాబు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు అందజేయాలని, జీవో 60ను యాథావిధిగా అమలు చేసి 8గంటల పనిదినాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనురాధ, జయసుధ, రాములు, వెంకటమ్మ, రేణుక, ఎల్లేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.