calender_icon.png 5 February, 2026 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద మల్లారెడ్డిలో కోతుల బెడదకు చెక్ పెట్టిన సర్పంచ్

05-02-2026 05:52:49 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో కొంతకాలంగా కోతుల బెడద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. పంటలను నాశనం చేయడం, ఇళ్లపైకి ఎక్కి వస్తువులను ధ్వంసం చేయడం వంటి ఘటనలు పెరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ సాయ గౌడ్ స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. కోతుల పట్టివేతలో నిపుణులైన సిబ్బందిని గ్రామానికి రప్పించి, జాలీల సహాయంతో కోతులను సురక్షితంగా పట్టుకుంటున్నారు. పట్టుబడిన కోతులను గ్రామానికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతాల్లో విడిచిపెడుతున్నట్లు తెలిపారు. ఈ చర్యలతో గ్రామంలో కోతుల బెడద తగ్గుతుందని, ప్రజలకు ఉపశమనం లభిస్తుందని గ్రామ పాలకవర్గం ఆశాభావం వ్యక్తం చేసింది.