24 April, 2026 | 6:14 PM

Breaking News

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి   •   నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •   ఆర్టీసీ కార్మికుడి మృతి ప్రభుత్వ హత్యగా భావించాలి   •   కాసిపేట 1A గని మ్యాన్ రైడింగ్ ప్రారంభించిన వేకటేశ్వర్లు, డైరెక్టర్ (ప్రాజెక్టు&ప్లానింగ్)   •   బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •  

త్వరలో మల్లమ్మకుంట రిజర్వాయర్ పనులు

07-09-2024 12:26 AM
  1. 508 ఎకరాల భూ సేకరణకు సర్వే 
  2. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ 

అలంపూర్, సెప్టెంబర్ 6: సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో త్వరలో అలంపూర్ నియోజకవర్గంలో మల్లమ్మ కుంట రిజర్వాయర్ పనులను ప్రారంభించనున్నట్లు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ వెల్లడించారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా శుక్రవారం సంపత్‌కుమార్ అలంపూర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వాయర్ పనులకు 508 ఎకరాల భూసేకరణ పనులు చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.