మల్లన్న హుండీ ఆదాయం రూ. కోటి
కొమురవెల్లి, మే 26(విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ లెక్కింపును ఆలయ వర్గాలు మంగళవారం చేపట్టాయి. ఈ లెక్కింపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. 60రోజులకు గాను రూ. కోటి 11లక్షల 87వేల 261రూపాయలు నగదు రాగా, మిశ్రమ బంగారం 102గ్రాములు, మిశ్రమా వెండి 4కిలోల 500 గ్రాములు విదేశీ కరెన్సీ 57నోట్లు హుండీల ద్వారా లభించినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి డి కృష్ణ ప్రసాద్ తెలిపారు.
దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో లెక్కింపు కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, స్థానాచార్యులు పి మల్లయ్య స్వామి ఆలయ ఏఈఓలు ఆర్ సుదర్శన్, బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్ , శ్రీశివరామకృష్ణ భజన మండలి సమితి సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






