యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా అనితా రెడ్డి
బీజేపీ బలోపేతం, యువత అభివృద్ధికి కృషి చేస్తా
నాగోల్, మే 25 (విజయక్రాంతి): తెలంగాణ భారతీయ జనతా యువమోర్చా (బిజేవైఎం) రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా చాడా అనితారెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. యువత సమస్యలపై చురుకుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ‘అనితా రెడ్డి’కి ఈ పదవి రావడం పట్ల నాగోల్‌లో బీజేవైఎం కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.
దేశ సేవ, యువత అభివృద్ధి పట్ల ఆమె చూపుతున్న అంకితభావం, నాయకత్వ లక్షణాలు పార్టీ గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో యువతను మరింతగా బీజేపీ సిద్ధాంతాల వైపు తీసుకెళ్లేందుకు ఆమె సేవలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనితారెడ్డి మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.






