భారీ సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు
కరీంనగర్ క్రైమ్ మార్చ్15 (విజయక్రాంతి): ఆపరేషన్ క్రాక్డౌన్ కరీంనగర్లో భారీ సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు; 12 మంది నిందితుల అరెస్ట్ కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు పో లీసులు చేపట్టిన ఆపరేషన్ క్రాక్డౌన్ లో భా గంగా ఒక భారీ వ్యవస్థీకృత నేర ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
సైబర్ మోసాలకు కీలకమైన మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సృ ష్టించి సరఫరా చేస్తున్న ప్రధాన సూత్రధారితో సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రకారం కేసు నమోదు చేసిన అ నంతరం దర్యాప్తులో భాగంగా ఈ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు అమాయక వ్యక్తుల పేరుతో లేదా స్వ యంగా వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ మరి యు కరెంట్ ఖాతాలను తెరిచేవారు.
ఆ ఖాతాలకు సంబంధించిన పాస్బుక్స్, ఏటీ ఎం కార్డులు, మరియు సిమ్ కార్డులను పై స్థాయి సైబర్ నేరగాళ్లకు విక్రయించేవారు. ఈ ఖాతాల ద్వారా సైబర్ మోసాలకు గురైన బాధితుల డబ్బును చేతులు మార్చడం మరి యు ఉపసంహరించుకోవడం చేసేవారని సీపీ తెలిపారు.పోలీసులు ప్రధాన నిర్వాహకుడు శ్రీ రాజేశ్వర్ రెడ్డి తో పాటు కరీంనగ ర్కు చెందిన మరో 11 మంది సహచరులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు అయిన ముదుగుంటి రాజేశ్వర్ రెడ్డి, తండ్రి: శ్రీనివాస్ రెడ్డి, వయస్సు: 22 భగత్నగర్, కరీంనగర్.నందగిరి సాయి వర్ధన్, తండ్రి: ఈశ్వరాచారి, వయస్సు 22 కిసాన్నగర్ కరీంనగర్. కాలిదాస్ కౌశిక్, తండ్రి: కన్నయ్య, వయస్సు 23 ధోబీవాడ, కరీంనగర్.ములంకుల రాజ్కుమార్, తండ్రి: కంకయ్య, వయస్సు 23 కట్టరంపూర్, కరీంనగర్.బండి సాయి కృష్ణ, తండ్రి: సదయ్య, వయస్సు 26 కన్నాపూర్, శంకరపట్నం మండలం.అడవెల్లి సాయి కార్తిక్, తండ్రి కుమార్, వయస్సు 23 విద్యానగర్, కరీంనగర్.మీర్ జామీ ఉద్దీన్, తండ్రి మీర్ జాకీ ఉద్దీన్, వయస్సు 22 స్వరణ్ స్ట్రీట్, కరీంనగర్.
మహమ్మద్ జవాద్ ఖాన్, తండ్రి: మహమ్మద్ సాజిద్ ఖాన్, వయస్సు 23 స్వరణ్ స్ట్రీట్, కరీంనగర్.సర్దార్ దల్జీత్ సింగ్, తండ్రి: సర్దార్ గోవింద్ సింగ్, వయస్సు: 23 నివాసం: కోతిరాంపూర్, కరీంనగర్.పల్లెర్ల అజయ్, తండ్రి: రాజు, వయస్సు 24 వెంకట్రావుపల్లి, లక్ష్మీపూర్ రామడుగునిర్మల్ల శివ, తండ్రి: శ్రీనివాస్, వయస్సు 23 మారుతినగర్, కరీంనగర్.దిద్దీ సాయి చరణ్, తండ్రి: నాగరాజు, వయస్సు: 22 రుక్మాపూర్, చొప్పదండి మండలం.తెలియని వ్యక్తులకు మీ బ్యాంక్ ఖాతాలు ఇవ్వడం, ఇతరుల కోసం అకౌంట్లు తెరవడం లేదా మీ ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు ఇతరులకు అప్పగించడం చట్టరీత్యా నేరం. ఇలా చేయడం వల్ల మీరు కూడా సైబర్ నేరాలలో భాగస్వాములు అవుతారని, కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని కరీంనగర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.




