17 April, 2026 | 12:43 PM

ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?

17-04-2026 11:38 AM

న్యూఢిల్లీ: రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్( Rajya Sabha Chairman) గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... లోక్ సభలో 2019 నుంచి డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. ఏడేళ్లుగా లోక్ సభ డిప్యూటీ స్పీకర్( Lok Sabha Deputy Speaker) పోస్టు ఖాళీ ఉందని చెప్పారు. రాజ్యసభ మాదిరిగానే లోక్ సభలోనూ జరిగితే బాగుండేదని పేర్కొన్నారు. ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటి?, ప్రజాస్వామ్యం నాశనానికి చాలా మంది కృషి చేస్తున్నారు.. మరి ఇదేంటి? అని ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.