26 August, 2026 | 10:30 PM

నేతకాని హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంతోష్

26-08-2026 08:50 PM

కోటపల్లి,(విజయక్రాంతి): నేతకాని సమాజ హక్కుల పరిరక్షణ, అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతున్న నేతకాని హక్కుల పోరాట సమితిలో కీలక నియామకం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోటపల్లి మండలం ఆలగామ గ్రామానికి చెందిన కుమ్మరి సంతోష్ను సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనగాం నరేష్ నియమించారు.

ఈ సందర్భంగా కుమ్మరి సంతోష్ మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచి జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు జనగాం నరేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ నేతకాని సమాజం హక్కుల కోసం ముందుండి పోరాడుతానని స్పష్టం చేశారు.

నేతకాని సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని, సమాజ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని సంతోష్ తెలిపారు. తన నియామకం నేతకాని సమాజానికి మరింత బలమైన స్వరం అందించేందుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.