26 August, 2026 | 9:24 PM

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ వేడుకలు

26-08-2026 08:43 PM

దుద్దిళ్ల శ్రీను బాబుకు రాఖీ కట్టిన వైనాల అనిత

కమాన్ పూర్,(విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి సందర్భంగా మంథని నియోజకవర్గంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. కమాన్ పూర్ ఏఎంసి చైర్మన్ వైనాల రాజు సతీమణి వైనాల అనిత, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబుకు రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా వైనాల అనిత మాట్లాడుతూ దుద్దిళ్ల శ్రీను బాబును అన్నగా భావించి రాఖీ కట్టడం ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి చెల్లెమ్మకు అన్నగా అండగా ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీను బాబు మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక అని అన్నారు. చెల్లెమ్మల ప్రేమాభిమానాలను ఎల్లప్పుడూ గౌరవిస్తూ వారికి అండగా ఉంటానని తెలిపారు. దుద్దిళ్ల కుటుంబం నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వామిగా ఉంటుందని పేర్కొన్నారు.