తెలుగుజాతికి రామోజీరావు మార్గదర్శి: మమతాబెనర్జీ
08-06-2024 11:33 AM
హైదరాాబాద్: ప్రముఖ మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు వృద్ధాప్య కారణాలతో తీవ్ర అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున 4:50 గంటలకు వెంటిలేటర్‌పై ఉంచి తుదిశ్వాస విడిచారు. రామోజీరావు మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. తెలుగుజాతికి రామోజీరావు మార్గదర్శి అన్నారు. రామోజీరావు తనను ఒకసారి ఫిల్మ్ సిటీకి ఆహ్వానించారని ఆమె తెలిపారు. ఫిల్మ్ సిటీ సందర్శన మధురానుభూతి తనకు ఇంకా గుర్తుందన్నారు. రామోజీరావు కుటుంబసభ్యులకు మమత ప్రగాఢ సానుభూతి తెలిపారు.






