1 September, 2026 | 11:55 AM

రామోజీరావు సేవలు చిరకాలం గుర్తుంటాయి: రాష్ట్రపతి ముర్ము

08-06-2024 11:47 AM

హైదరాబాద్: ఈనాడు మీడియా గ్రూప్ చైర్మన్, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకుడు రామోజీ రావు మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం సంతాపం తెలిపారు. ప్రముఖ మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు అస్తమయంతో దేశ మీడియా దిగ్గజాన్ని కోల్పోయిందన్నారు. రామోజీరావు ఒక వినూత్న వ్యాపారవేత్త ఆమె తెలిపారు. రామోజీరావు సేవలు చిరకాలం గుర్తుంటాయని చెప్పారు. రామోజీరావు కుటుంబసభ్యులకు రాష్ట్రపతి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వృద్ధాప్య కారణాలతో తీవ్ర అనారోగ్యం పాలైన రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.