రామోజీ రావు అంతిమ సంస్కారాల వివరాలు
హైదరాబాద్: ప్రముఖ మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు వృద్ధాప్య కారణాలతో తీవ్ర అనారోగ్యంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఈ నెల 5న రామోజీరావు శ్వాసకోశ సమస్యతో స్టార్ ఆస్పత్రిలో చేరారు. శనివారం తెల్లవారుజామున 4:50 గంటలకు వెంటిలేటర్‌పై ఉంచి తుదిశ్వాస విడిచారు. చివరి నివాళులర్పించేందుకు వీలుగా ఆయన రామోజీ ఫిలిం సిటీ ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. ఆదివారం అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో రేపు ఉదయం 9 నుంచి 10 మధ్య ఆయయ అంత్యక్రియలు చేయనున్నారు. అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సదస్సుకు హాజరైన ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు పంపారు. ఏర్పాట్లను సైబరాబాద్ కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్ పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు. ఆయన భౌతికకాయాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు చివరి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున రామోజీ ఫిలిం సిటీ చేరుకుంటున్నారు.






