14 August, 2026 | 10:48 PM

వైన్ షాపులో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

14-08-2026 09:38 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని వైన్ షాపులో చివరికి పాల్పడ్డ మహారాష్ట్రకు చెందిన శంకర్ మేరీబా నవీన్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు సీఐ గురుస్వామి తెలిపారు. పొచ్చర ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించడంతో దొంగ తనం కేసు బయటపడిందన్నారు.

సోనాల మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి అదే బైక్ పై వెళ్లి ఇనుపరాడితో షట్టర్ పగలగొట్టి లోపలికి ప్రవేశించి 2500 రూపాయలు నగదుతో పాటు మద్యం సీసాలను దొంగతనం చేసినట్లు వెల్లడించాడని సీఐ తెలిపారు. ఆయనతోపాటు మహమూద్ అనే మరో వ్యక్తి కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించారని సిఐ పేర్కొన్నారు. నిందితుడి నుంచి దొంగలించిన వాహనం మూడు మద్యం సీసాలు 400 రూపాయలు నగదు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు మహమూద్ కోసం గాలిస్తున్నామన్నారు. స్థానిక ఎస్సై వి పురుషోత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి దొంగను పట్టుకోవడం జరిగిందన్నారు. ఈయనతో పాటు చాకచక్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ హఫీజ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ ని సిఐ అభినందించారు.