ట్రాక్టర్ ట్రాలీ బోల్తా.. ముగ్గురికి గాయాలు
04-08-2026 03:08 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామ శివారులో ఉట్నూర్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్న కాంక్రీట్ మిషన్ మిల్లర్ ఆటో ట్రాలీ బోల్తా పడింది. ట్రాలీపై ప్రయాణించే ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఆత్రం సోము కు తీవ్ర గాయాలు కాగా, శేఖర్, లక్షలకు స్వల్ప గాయాలయ్యాయి. గాయాలు అయిన వారిని 108 అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు.






