5 August, 2026 | 9:50 AM

బీజేపీ ప్రజావ్యతిరేక పాలనపై సీపీఐ పోరుబాట

05-08-2026 09:07 AM

మహబూబాబాద్ జిల్లాకార్యదర్శి బి. విజయసారధి

మహబూబాబాద్ (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని, ఎందుకు నిరసనగా ఈ నెల 6 నుండి14 వరకు సీపీఐ చేసే ప్రచారజాత ను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి బి.విజయ సారధి పిలుపునిచ్చారు. కురవి మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో తురక రమేష్ అధ్యక్షతన జరిగిన డోర్నకల్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు నెల్లూరు నాగేశ్వరరావు, మరిపెడ, డోర్నకల్ మండల కార్యదర్శులు మారగాని బాలకృష్ణ, తురక రమేష్ నాయకులు బుర్ర సమ్మయ్య, బుడమ వెంకన్న, దొంతు  రామ్మూర్తి, కన్నే వెంకన్న, బొల్లం ఉప్పలయ్య, నిలుగొండ నాగేశ్వరరావు, రవి , సూరి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.