30 June, 2026 | 10:33 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య

11-06-2025 12:24 AM

ఘట్ కేసర్, జూన్ 10 (విజయక్రాంతి) : ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి జీవితం పై విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘట్ కేసర్ బ్రూక్ బాండ్ కాలనీకి చెందిన గుంట రమేష్ (39) బోడుప్పల్ లోని లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

సోమవారం రాత్రి 9గంటల సమయంలో గుంట రమేష్  తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చుట్టుప్రక్క వారి సహాయంతో డోర్ పగలగొట్టి తెరిచి, క్రిందకు దింపి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు.

అక్కడి డాక్టర్స్ అప్పటికే రమేష్ చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఇతని మరణానికి ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తుందని పోలీసులు తెలిపారు. మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.