15 June, 2026 | 7:18 PM

Breaking News

అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •  

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

29-03-2026 03:59 PM

పాపన్నపేట: మనస్థాపంతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఫిరంగి సత్యనారాయణ (50) కల్లు వ్యాపారం చేస్తూ జీవితం సాగిస్తున్నాడు. కాగా వారం రోజుల క్రితం ఈయన పెద్ద కూతురు నిశ్చితార్థం జరిగింది. దీంతో త్వరలో వివాహం ఉండడంతో వివాహానికి నగదు లేక అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు.

అప్పు ఎక్కడ దొరక్కపోవడంతో మనస్థాపం చెందిన అతను శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టూ పక్కల వెతకగా ఆదివారం ఉదయం సమయంలో గ్రామ శివారులోని రోడ్డు పక్కనే పాడుబడిన రైస్ మిల్లులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.