calender_icon.png 27 December, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్ట్రీట్ లైట్ స్తంభం షాక్ తగిలి వ్యక్తిమృతి

04-05-2024 01:56:34 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్‌లోని కృష్ణానగర్‌లో వీధి దీపాల విద్యుత్ స్తంభానికి ఓ వ్యక్తి తగిలి మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లాకు చెందిన రుషి గత పదేళ్లుగా కృష్ణానగర్‌లో నివాసం ఉంటూ హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి సమయంలో జీరాక్స్ కోసం బయటకు వెళ్లగా కృష్ణానగర్ ప్రధాన రహదారిలోని వీధి దీపాల స్తంభానికి తగలడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ స్తంభానికి కరెంటు సరఫరా అవుతోందని, రుషి మరణానికి జీహెచ్‌ఎంసీ అధికారులే బాధ్యత వహించి తగిన నష్టపరిహారం చెల్లించాలని మృతుడు సోదరుడు డిమాండ్ చేశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. 

ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మంటలు

యూసుఫ్‌గూడ ఎల్లారెడ్డి గూడ సమీపంలోని శుక్రవారం ఓ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద చెత్త నిల్వలకు నిప్పు పెట్టడం కారణంగా అక్కడ ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన లో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.