04-05-2024 01:56:55 AM
బీజేపీ, బీఆర్‌ఎస్‌కు వేసే ఓటు వృథా
మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, మే 3 (విజయక్రాంతి): బీజేపీ, బీఆర్‌ఎస్‌కు వేసే ఓటు వృథా అని, కాంగ్రెస్‌కు గెలిస్తేనే అభివృద్ధికి బాటలు పడతాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుతో కలిసి కరీంనగర్‌లోని రాజీవ్ చౌక్ టవర్స్ రోడ్‌లో శుక్రవారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సతీమని మంగళసూత్రాలు అమ్మి ఎన్నికల పోటీ చేశానని తరచూ చెప్పుకొనే బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కి, ఇప్పుడు రూ.కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. జిల్లా మంత్రిగా కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్య నారాయణ, ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.