1 July, 2026 | 10:19 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

కాలువలో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి

31-03-2025 01:21 AM

దౌల్తాబాద్, మార్చి 30 : రామాయంపేట కెనాల్ కాలువలో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇందుప్రియల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా మచ్చనూర్ గ్రామానికి చెందిన ఇర్బ ఎడకే(45) తన భార్య పిల్లలతో రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది కనకరాజు ఇటుక బట్టీలో కూలీ పని కోసం రెండు నెలల క్రితం వచ్చాడు.

ఉదయం రామయంపేట కెనాల్ కాలువలో స్నానానికి వెళ్లి నీట మునిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య చందర్ బాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.