21 April, 2026 | 10:18 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

21-04-2026 08:46 PM

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండలం ఐలాపురం స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన పంతం వెంకన్న (40) మృతి చెందాడు. మృతుడు పాపయ్య కుమారుడు కాగా, ప్రస్తుతం సూర్యపేటలో నివాసం ఉంటూ మార్బుల్ పనులు చేసుకుంటున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం, సోమవారం రాత్రి పని నిమిత్తం తన స్నేహితుడి బైక్‌ (TS 29 R 4412)పై చివ్వెంలకు వెళ్లి తిరిగి వస్తుండగా, రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ఐలాపురం ఫ్లైఓవర్ దాటిన అనంతరం కూడకూడ రోడ్డుపై ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అతని బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకన్నకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం సుమారు 11:30 గంటలకు మృతి చెందాడు. మృతుడి మామ సల్లగొండ మల్సూర్ ఫిర్యాదు మేరకు చివ్వెంల ఎస్‌ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.