పిడిఎఫ్ బియ్యం పట్టివేత
* ముగ్గురిపై కేసు నమోదు
గరిడేపల్లి,(విజయక్రాంతి): అక్రమంగా నిల్వ ఉంచిన 29 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకొని ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు గరిడేపల్లి ఎస్ఐ చలిగంటి నరేష్ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని కాచవారిగూడెం గ్రామానికి చెందిన గుడిపాటి వెంకటేశ్వర్లు గుడిపాటి కనకయ్య ముప్పారపు రామయ్యలు అక్రమంగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాలకు పంపే బియ్యాన్ని అక్రమంగా వారి ఇండ్లలో కలిగి ఉన్నారనే నమ్మదగిన సమాచారం మేరకు తమ సిబ్బందితో గ్రామానికి వెళ్లి వారి వారి ఇండ్లలో పరిశీలించి చూడగా బియ్యం లభ్యమైనట్లు తెలిపారు.సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వగా ఆర్ఐ చెన్న కృష్ణారెడ్డి వచ్చి పంచనామా నిర్వహించి వెంకటేశ్వర్లు ఇంట్లో 22 క్వింటాలు కనకయ్య ఇంట్లో 3 క్వింటాలు,రామారావు ఇంట్లో నాలుగు క్వింటాల బియ్యం స్వాధీన పరచుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.






