21 April, 2026 | 10:08 PM

యువకుడిని కాపాడిన సెల్ఫీ వీడియో

21-04-2026 08:44 PM

సకాలంలో చేరుకొని రక్షించిన పోలీసులు 

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన లావుడ్య రవి ప్రసాద్ (24) యువకుడు ఈరోజు అచ్చంపేట కేంద్రంలోని వై జంక్షన్ వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను ఉరి వేసుకునే ముందు ఒక వీడియో తీసి తాను మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా పోస్ట్ చేశాడు. ఈ వీడియోను గుర్తించిన పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆ యువకుడుని కాపాడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం బాధితుడి తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు. యువకుడిని కాపాడిన పోలీస్ బృందానికి యువకుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.