8 June, 2026 | 9:49 PM

Breaking News

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యూపీహెచ్సి రామవరం లో అవగాహన కార్యక్రమం   •   ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కార్యశాల   •   పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బదిలీ   •   సునంద రైస్ ఇండస్ట్రీ ట్రెండ్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేయాలి   •   బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి సన్మానం చేసిన గ్రామస్తులు   •   ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి   •   పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్   •   పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి   •   చింతకుంటలో కేత్ బచావో- భూమి సంరక్షణ కార్యక్రమం   •   సమస్యలను తెలుసుకున్నందుకే బుల్లెట్ పై ప్రయాణం   •  

ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

08-06-2026 08:27 PM

ఫకీర్ నాయక్ తండాలో విషాద ఛాయలు

సిరికొండ,(విజయక్రాంతి): ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సిరికొండ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై భూపెల్లి విక్రమ్ , స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఫకీర్ నాయక్ తండాకు చెందిన జాదవ్ జ్ఞానేశ్వర్ తండ్రి జాదవ్ ప్రకాష్ (28)  కల్టివేటర్ రిపెరు కోసం ట్రాక్టర్ పట్టుకొని ఫకిర్ నాయక్ తండ నుంచి సిరికొండ వెళ్తుండగా లెండిగూడ బ్రిడ్జి వద్ద గుంతలు ఉండడంవల్ల తాను నడుపుతున్న ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బ్రిడ్జి కింద  బోల్తాపడింది.

ప్రమాద సమయంలో ట్రాక్టర్ కింద చిక్కుకున్న జ్ఞానేశ్వర్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు తో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. జ్ఞానేశ్వర్ మృతితో ఫకీర్ నాయక్ తండాలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కలచివేశాయి.