21 March, 2026 | 1:35 PM

Breaking News

తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •  

వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి

21-03-2026 12:23 PM

హైదరాబాద్: వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని మహిళపై ప్రియుడు(Boyfriend) కత్తితో దాడి చేశాడు. నిందితులు అలీషా, అతని తండ్రి లాలూను పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ లోని రెడ్డికాలనీలో ఉంటూ నూకరత్నం హౌస్ కీపింగ్ పని చేస్తోంది.  భర్తను కోల్పోయిన నూకరత్నంకు ఇద్దరు ఆడపిల్లులున్నారు.

నూకరత్నం పనిచేసేచోటే ఆలీషా వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 20న ప్రసాద్ అనే వ్యక్తిని నూకరత్నం వివాహం చేసుకుంది. ఈ నెల 19న తండ్రి లాలూ, స్నేహితుడు జాన్ తో కలిసి ఆలీషా మహిళ ఇంటికి వెళ్లాడు. తనతో రావాలని మహిళతో ఆలీషా గతంతో గొడవపడినట్లు ఆరోపణలున్నాయి. తనతో రావడానికి నిరాకరించడంతో మహిళపై ఆలీషా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నూకరత్నం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.