1 July, 2026 | 9:20 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

05-10-2024 11:35 AM

జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డీ గ్రామంలో శుక్రవారం రాత్రి కరెంట్ షాక్ తో చందు (55) అనే వ్యక్తి మృతి చెందాడు. తన ఇంటి ముందు వర్షపు నీరు ఇంట్లోకి రాకుండా మురికి కాలువలో చిత్తచెదారాన్ని తొలగించే క్రమంలో పక్కనే ఉన్న కరెంట్ స్తంభం చెయ్యి తాకడంతో షాకుకు గురయ్యాడు ‌. కరెంట్ షాక్ తో స్పృహ తప్పి కింద పడి పోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం బీదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనను పరీక్షించి, మృతి చెందినట్లు తెలిపారు. హద్నూర్ పోలీసులు శనివారం బీదర్ ఆస్పత్రిని సందర్శించి ఘటన వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.