15 April, 2026 | 4:35 PM

సిద్దిపేట కోర్టు ఆవరణలోనే గుండెపోటుతో వ్యక్తి మృతి

17-10-2025 03:09 PM

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేటలో గత సంవత్సరం సెప్టెంబర్ లో అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన షర్బద్దీన్ అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. కాగా ఆ కేసు శుక్రవారం తుది తీర్పు ఉండడంతో తన ఇద్దరు కుమారులతో సిద్దిపేట జిల్లా కోర్టుకు వచ్చిన  బడేసాబ్ (55) తీర్పు అనుకూలంగా వస్తుందో లేదో అని తీవ్ర మస్తాపానికి గురయ్యాడు. కోర్టు పాంగనంలోనే గుండెపోటుతో మృతి చెందాడు.