17-10-2025 03:08:12 PM
హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరగబోయే బీసీ బంద్‌కు శాయంపేట మండలంలోని అన్ని బీసీ సంఘాలకు తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని బీజేపీ యువనేత లడే శివ అన్నారు. బీసీ హక్కుల కోసం జరిగే ఈ బంద్‌ను భారీ స్థాయిలో నిర్వహించాలని, బీసీల ఏకతాటిపై నిలబడి తమ శక్తిని చూపించాలని ఆయన కోరారు.శాయంపేట మండలంలోని 24 గ్రామాలలో ఉన్న బీసీ సంఘాలు అంతా రోడ్డెక్కి, “42శాతం రిజర్వేషన్ సాధించేవరకు బీసీలు తగ్గేది లేదు” అనే నినాదంతో బంద్ విజయవంతం చేయాలని లడే శివ ఆకాంక్షించారు. బీసీల సామాజిక, ఆర్థిక పురోగతికి రిజర్వేషన్లు ఎంతగానో అవసరమని, ఈ ఉద్యమం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయమైన హక్కులను సాధించాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు.బీసీ బంధు కార్యక్రమానికి అన్ని బీసీ సంఘాలు,యువత, పెద్దలు మద్దతు తెలిపి ఐక్యతను చాటాలని లడే శివ కోరారు.