15 April, 2026 | 4:35 PM

ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ నరసింహ

17-10-2025 03:11 PM

కోదాడ: అనంతగిరి మండల పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఎస్పీ నర్సింహ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ డైరీ ని తనిఖీ చేసి మండల పరిధిలో తరచుగా నమోదవుతున్న నేరాలు, పిర్యాదుల తీరుతెన్నులు, కేసుల స్థితిగతులు మొదలగు అంశాలను పరిశీలించారు. గ్రామ రిజిస్టర్లు, హిస్టరీ షీట్స్, రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, పెండింగ్ కేసు ఫైల్స్, కోర్టు డ్యూటీ విధులను, రిసెప్షన్ విధులు, బ్లూ కొట్ విధులు, పెట్రో కార్ విధులు, కేసుల అంతర్జాల నమోదు, సిసి టిఎన్ఎస్ సిస్టం, సి సి కెమెరాల పని తీరు, సెక్షన్ విధులు, ఎస్ హెచ్ ఓ విధులు, పోలీసు పని విభాగాలు, అమలౌతున్న పని విభాగాలను పరిశీలించారు.

అనంతరం శాంతినగర్ గ్రామానికి వెళ్లే రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తిచేసేలా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని స్థానిక ఎస్సై నవీన్ కుమార్ కు సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... పోలీసు విధులు, ఫంక్షనల్ వర్టికల్ విభాగాలను సమర్థవంతంగా నిర్వర్తించడం వల్ల పోలీస్ సేవలు వేగంగా ప్రజలకు అందుతాయి అన్నారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించి ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని కేసులు పెండింగ్ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఎస్సై నవీన్ కుమార్ ,సిబ్బంది ఉన్నారు,