calender_icon.png 15 February, 2026 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తిని కారుతో ఢీ కొట్టి కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లి

15-02-2026 12:00:00 AM

మేడ్చల్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): పోకిరీలు అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒక వ్యక్తిని ఢీ కొట్టి అలాగే కిలోమీటర్ల వరకు ఈడ్చి కెళ్ళిన ఘటన కుషాయిగూడ పరిధిలో జరిగింది. సతీష్ అనే వ్యక్తి తన వా హనంలో వెళ్తుండగా కొంతమంది పోకిరీలు కారుతో వెనుక నుంచి ఢీ కొట్టి వెళ్లిపోయారు.

సతీష్ ఆ వాహనాన్ని ఓవర్టేక్ చేసి ఆపి ప్రశ్నిస్తుండగా కారుతో ఢీ కొట్టి అలాగే ఈడ్చు కెళ్లారు. సతీష్ కారు బంపర్ పట్టుకొని కొద్ది దూరం వెళ్లిన తర్వాత విడిచిపెట్టాడు. సతీష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోకిరిలు గంజాయి మత్తులో ఉన్నారని, ఆ వాహనానికి పోలీస్ సైరన్ కూడా ఉందని తెలిసింది. సైరన్ వేసుకుని నడిపినట్లు తెలిసింది.