15-02-2026 12:00:00 AM
మలక్‌పేట్, ఫిబ్రవరి 14 (విజయ్ క్రాంతి): రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ లకు జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ వాటికి బ్రహ్మరథం పట్టారని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చెకోలేకర్ లక్ష్మి అన్నారు. పుర పోరులో ప్రజలిచ్చిన తీర్పుని స్వాగతిస్తూ శనివారం ముసలంబాకు చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
సందర్భంగా చెకోలేకార్ లక్ష్మి, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి చెకోలేకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పై ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కనివిని ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు పలికారని, ఇందుకు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిషన్ సింగ్, రాహుల్, లింగాల శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.