ఆసుపత్రిలో చేరిన మంచు మనోజ్
హైదరాబాద్,(విజయక్రాంతి): సినీ నటుడు మంచు మనోజ్ కాలికి గాయం కావడంతో బంజారాహిల్స్ లోని టీఎక్స్ దవాఖానకు చికిత్స నిమిత్తం వచ్చారు. మనోజ్ తోపాటు అతని భార్య మౌనిక కూడా ఉన్నారు. ఆసుపత్రి వైద్యులు మనోజ్ కు పరీక్షలు నిర్వహించి, కాలికి చికిత్స చేశారు. మంచు మనోజ్ నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఆసుపత్రికి వెళ్లున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మోహన్ బాబుకు, ఆయనకు తనయుడు మనోజ్ కు ఆస్తుల విషయంలో ఆదివారం ఉదయం గొడవ జరిగిందని, ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నట్లు వార్తాలు వినిపిస్తున్నాయి. తన తండ్రి తనను తీవ్రంగా కొట్టాడని మనోజ్ గాయాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో నే మోహన్ బాబు స్పందిస్తూ, తన కుటుంబంపై అసత్య ప్రచారాలు చేయొద్దంటూ హెచ్చరించారు. తాజా మనోజ్ కుంటుకుంటూ ఆసుపత్రికి వెళ్లడంతో అట సినీ పరిశ్రమల్లోను, ఇటు మీడియాలోనూ మరోసారి చర్చనీయాంశమైంది.






