15 July, 2026 | 12:08 AM

మంచు ఫ్యామిలీలో కుటుంబ కలహాలు

08-12-2024 12:47 PM

హైదరాబాద్: ప్రముఖ నటుడు మోహన్‌బాబు తన చిన్న కొడుకు మంచు మనోజ్‌పై దాడి చేశాడన్న వార్త ఆదివారం ఉదయం వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో నటుడు మంచు మనోజ్ తన తండ్రిపై దాడి చేసి గాయపర్చారని ఫిర్యాదు చేసినట్లు పలు న్యూస్ ఛానెల్స్ నివేదించాయి. స్కూల్, ఆస్తుల వ్యవహారంలో పరస్పర దాడులు జరిగినట్లు తెలుస్తోంది. వాగ్వాదం సందర్భంగా తన తండ్రి తనను తీవ్రంగా కొట్టాడని మనోజ్ ముఖం, శారీరక గాయాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు. తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని మోహన్ బాబుపై ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

న్యూస్ ఛానల్స్ పోలీసుల ఫిర్యాదు వార్తలు వైరల్ కావడంతో ప్రముఖ నటుడి కుటుంబం సంఘటనను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తలు అవాస్తవం. గాయపడిన మంచు మనోజ్ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. మంచు మోహన్ బాబు కుటుంబం తన పీఆర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది.