28 June, 2026 | 1:04 AM

మండాడి.. సాట్టపులి

28-06-2026 12:02 AM

సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో సూరి, సుహాస్ ఇద్దరూ కూడా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 4న రిలీజ్ చేయబోతోన్నారు. తాజాగా సుహాస్ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోని షేర్ చేశారు.

అందులో సుహాస్ మేకోవర్, సీన్స్‌ను షూట్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఈ మూవీ లో సాట్ట పులిగా సుహాస్ పాత్రలో మెప్పించబోతోన్నారనిపిస్తోంది. ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకు సంగీతాన్ని జీవీ ప్రకాశ్ కుమార్ అందించగా, ఎస్‌ఆర్ కథిర్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేశ్ మాథ్యూ కంపోజ్ చేశారు.