9 May, 2026 | 10:41 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నిక...

24-03-2025 06:50 PM

పాపన్నపేట: మండల ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పాపన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొత్తలింగాయిపల్లికి చెందిన కొత్త వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా బెజుగం విఠలేశ్వర్, కోశాధికారిగా గడ్డం రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహిళా సంఘం మండల కమిటీ అధ్యక్షురాలిగా కొత్త సరస్వతి, ప్రధాన కార్యదర్శిగా స్వప్న, కోశాధికారిగా జ్యోతి ఎన్నికయ్యారు.

అధ్యక్షుడు వెంకటేశం మాట్లాడుతూ... సంఘం బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు ఆర్యవైశ్య సంఘ నాయకులు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ సమావేశంలో కొత్తపల్లి, పాపన్నపేట, చీకోడ్ సొసైటీ అధ్యక్షులు రమేష్ గుప్త, మల్లేశం, దత్తరాజు, పాపన్నపేట గ్రామ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్ గుప్త, సంఘం నాయకులు అశోక్, రాజ్ కుమార్, రవీందర్, శ్రీనివాస్, రాములు తదితరులున్నారు.