1 July, 2026 | 11:12 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మంధాన క్లాస్.. రిచా మాస్

20-12-2024 12:43 AM
  1. వెస్టిండీస్‌పై భారీ విజయం 
  2. 2 సిరీస్ భారత్ సొంతం

  3. 217 - మహిళల టీ20 చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఆసియా కప్‌లో యూఏఈపై సాధించిన 201 పరుగులు ఉత్తమం.

763 - ఈ ఏడాది టీ20ల్లో మంధాన సాధించిన పరుగులు. లంక కెప్టెన్ ఆటపట్టును దాటి  తొలి స్థానం.

ముంబై: స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు 2 సొంతం చేసుకుంది. గురువారం ముంబై వేదికగా జరిగిన మూ డో టీ20లో టీమిండియా 60 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

మంధాన క్లాస్ ఇన్నింగ్స్‌కు తోడు రిచా మాస్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టడంతో భారత్ సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికె ట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. మం ధాన (47 బంతుల్లో 77), రిచా ఘోష్ (21 బంతుల్లో 54) అర్థశతకాలతో రాణించారు.

21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన రిచా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ జాబితాలో సోఫీ డివైన్, ఫోబే లిచ్‌ఫీల్డ్ సరసన చేరిం ది. రాఘవి బిస్త్ (31 నాటౌట్) ఆకట్టుకుంది. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిం డీస్ 19.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులకు పరిమితమైంది. భారీ లక్ష్యం కావడంతో ఛేదనలో వెస్టిండీస్ ఒత్తిడికి గురైంది. చినెల్లె హెన్రీ (43) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 4 వికెట్లతో రాణించింది.