17 April, 2026 | 2:31 AM

మను సింఘ్వీ, నరేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

17-04-2026 12:32 AM

రాజ్యసభ సభ్యులకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి గురువారం పార్లమెంట్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై రాజ్యసభ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వేం నరేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనకు కాంగ్రెస్ పార్టీ గొప్ప అవకాశం కల్పించిందన్నారు.

పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా సమస్యల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల గురించి పోరాటం చేస్తానని, అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఎంపీగా అవకాశం కల్పించిన పార్టీ అధిష్టానానికి వేం నరేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.