భారతీయుడుతో మనీషా?
మనీషా కొయిరాల ఒకప్పుడు కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ‘బొంబాయి’, బాబా వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘భారతీయుడు’లో కథానాయికగా కమల్‌హాసన్‌తో ఆడిపాడింది. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల తర్వాత వస్తున్న భారతీయుడు సీక్వెల్‌లో మనీషా మరోమారు కనపడనున్నారా? అంటే, ఔననే సమాధానమే వస్తోంది. దర్శకుడు శంకర్‌తో మనీషా కొయిరాల కలిసి ఉన్న ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వచ్చి చేరాయి.
ఇది ఈ వార్తకు బలం చేకూర్చినట్టయింది. కమల్‌హాసన్‌తోపాటు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, శ్రీకాంత్, సునీల్ తదితర భారీ తారాగణంతో తెరకెక్కింది. ఇటీవల ‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించిన మనీషా భారతీయుడు సీక్వెల్‌లో అతిథి పాత్రలో తళుక్కుమననున్నారా? లేక పూర్తిస్థాయి పాత్రలో నటించనున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. ‘భారతీయుడు నుంచి ‘తాతా వస్తాడే..’ అన్న పాట ఇటీవల విడుదలవ్వగా, జూలై 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






