18 March, 2026 | 6:54 PM

ప్రోటోకాల్ పాటించకుండా అవమాన పరిచారు

18-03-2026 05:24 PM

జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీకి ఫిర్యాదు చేసిన మంథని 6వ కౌన్సిలర్ శ్రీలత

మంథని,(విజయక్రాంతి): ప్రోటోకాల్ ఉల్లంఘించి బీసీ మహిళ కౌన్సిలర్ ను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంథని మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ పోతరబోయిన శ్రీలత క్రాంతి బుధవారం జిల్లా ‍‍అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీకి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఇటీవల మంథని మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో 6వ వార్డు బోయినపేట్ కౌన్సిలర్ గా 474 ఓట్ల భారీ మెజారిటీతో జిల్లా స్థాయిలో అధ్యధిక రికార్డు మెజార్టీతో గెలుపొందానని,

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమములో ఈ నెల 17వ తేదీ న మంగళవారం మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యములో 6వ వార్డు పరిధిలోని బోయిని పేట్ తెనుగు వాడ, గొల్ల గూడెం, దుబ్బగూడెం లలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమము నిర్వహించారని,  కానీ 6వ వార్డు కౌన్సిలర్ అయిన నాకు సమాచారం ఇవ్వకుండా, ప్రోటోకాల్ ఉల్లంఘించి ఒక బీసీ మహిళ ప్రతినిధినైనా నన్ను కావాలనే తీవ్రంగా అవమానించారని ఫిర్యాదులో వాపోతున్నారు.

అయినా నాకు సమాచారం తెలియగానే  ఉదయం నుండి సాయంత్రం వరకు మున్సిపల్ పరిశుద్ధ కార్మికులతో దగ్గరుండి పనులు చేయించుకుంటూ ఉంటున్నానని, బోయిన్ పేటలో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మున్సిపల్ కార్యాలయం నుండి అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారని, కానీ అందులో ప్రజలతో ఎన్నుకోబడ్డ నన్ను విస్మరించి ఉద్దేశపూర్వకంగానే నా పేరు రాయకుండా నాపై పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి భర్త పేరు ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లను, బీఆర్ఎస్ నాయకున్ని కాంగ్రెస్ నాయకులను వారి పేర్లను మాత్రమే పెట్టి నన్ను తీవ్రంగా అవమానించారని,  ఈ కార్యక్రమంలో బాధ్యతారహితంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకొని దయచేసి ఇకనుండి ప్రోటోకాల్ ఉల్లంఘించకుండా చూసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఫిర్యాదు చేసినట్లు కౌన్సిలర్ శ్రీలత తెలిపారు.